: సాగు నీటి ప్రాజెక్టుల్లో కేసీఆర్ కు రూ.200 కోట్ల ముడుపులు: మంద కృష్ణ


తెలంగాణ సీఎం కేసీఆర్ పై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మరోమారు ఆరోపణలు గుప్పించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి కేసీఆర్ రూ.200 కోట్ల మేర ముడుపులను అందుకున్నారని ఆయన ఆరోపించారు. సాగు నీటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ఇప్పటిదాకా విడుదల చేసిన రూ.2,500 కోట్ల చెల్లింపుల ద్వారానే కేసీఆర్ కు రూ.200 కోట్ల మేర ముడుపులు అందాయని ఆయన ఆరోపించారు. ముడుపులు తీసుకుని, అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ ను గవర్నర్ బర్తరఫ్ చేయాలని మంద కృష్ణ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News