: రాజకీయ దురుద్దేశంతోనే ఆప్ కు ఐటీ నోటీసులన్న కాంగ్రెస్... అలాంటిదేమీ లేదన్న బీజేపీ


ఢిల్లీ ముఖ్యమంత్రిగా రెండో సారి పదవీ బాధ్యతలు చేపట్టనున్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి ఐటీ నోటీసుల జారీపై బీజేపీ, కాంగ్రెస్ లు మాటల యుద్ధానికి తెరతీశాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తనను చిత్తుగా ఓడించిందన్న అక్కసుతోనే ఆప్ కు బీజేపీ నోటీసులు జారీ చేయించిందని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ ఆరోపణలపై వెనువెంటనే స్పందించిన బీజేపీ, ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. ఆప్ కు ఐటీ నోటీసుల వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవన్న బీజేపీ, ఐటీ శాఖ తన పని తాను చేసుకుపోతోందని వివరించింది.

  • Loading...

More Telugu News