: కొత్త రాష్ట్రానికి సాయం చేయలేదన్న ప్రచారం వాస్తవం కాదు: ఎంపీ కంభంపాటి హరిబాబు


కొత్త రాష్ట్రం ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదన్న ప్రచారం వాస్తవం కాదని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. పునర్విభజన చట్టంలోని హామీల అమలుకు కేంద్రం చిత్తశుద్ధితో ఉందని ఢిల్లీలో పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదాపై ఇతర రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు ఉన్నాయని, వారందరినీ ఓసారి సంప్రదించాక నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చాలన్న దానిపై కసరత్తు చేస్తున్నామన్నారు. 6,500 మెగవాట్ల విద్యుత్ ప్రాజెక్టులను కేంద్రం ఏర్పాటు చేయనుందని, 7 జాతీయ విద్యా సంస్థలకు రూ.7,500 కోట్లు వెచ్చించనున్నామని ఎంపీ తెలిపారు.

  • Loading...

More Telugu News