: 'ఏఐబీ రోస్ట్'పై అమీర్ ఖాన్ స్పందన
ఇటీవల వివాదాస్పదమైన 'ఏఐబీ రోస్ట్'పై బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ స్పందించారు. తానింకా ఆ కార్యక్రమాన్ని చూడలేదని, 'రోస్ట్' లో అటువంటి జోకులు ఉపయోగించడంపై తాను తీవ్రంగా నిరాశ చెందానని అన్నారు. ఆ కార్యక్రమం శ్రుతిమించినదని తాను భావిస్తున్నట్టు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ చెప్పారు. ఇందులో పాల్గొన్న అభ్యర్థుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై అమీర్ ఎలాంటి అభిప్రాయం వెల్లడించలేదు. అయితే, ఇటువంటి సమయాల్లో ప్రేక్షకుల పట్ల కార్యక్రమ నిర్వాహకులు మరింత బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా వ్యవహరించాలని మాత్రం చెప్పగలనన్నారు. 'రోస్ట్' లో పాల్గొని అభ్యంతరకర భాష ఉపయోగించారంటూ దర్శకనిర్మాత కరణ్ జోహార్, హీరోలు రణ్ వీర్ కపూర్, అర్జున్ కపూర్ లపై కేసు నమోదవడం తెలిసిందే.