: వెంకయ్య గారూ... ప్రమాణ స్వీకారోత్సవానికి రండి: కేజ్రీవాల్ ఆహ్వానం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కొద్దిసేపటి క్రితం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడిని కలిశారు. నేటి ఉదయం ఢిల్లీలోని నిర్మాణ్ భవన్ కు వెళ్లిన కేజ్రీవాల్, వెంకయ్యతో భేటీ అయ్యారు. ఈ నెల 14న తాను ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నానని ఈ సందర్భంగా కేజ్రీవాల్, వెంకయ్యకు తెలిపారు. రామ్ లీలా మైదాన్ లో జరిగే సదరు కార్యక్రమానికి హాజరుకావాలని ఆయన వెంకయ్యను ఆహ్వానించారు. నిన్న వెలువడ్డ ఎన్నికల ఫలితాల్లో ఘనవిజయం సాధించిన కేజ్రీవాల్ ను వెంకయ్యనాయుడు అభినందించారు.