: సిక్కోలు జిల్లాలో గజరాజుల బీభత్సం... ప్రార్థనా మందిరం ధ్వంసం
ఏపీలో గజరాజుల బీభత్సం నానాటికీ పెరిగిపోతోంది. చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గ ప్రజలను గజరాజులు నిత్యం వణికిస్తుండడం తెలిసిందే. తాజాగా, ఏనుగులు శ్రీకాకుళం జిల్లాలోనూ బీభత్సం సృష్టించాయి. జిల్లాలోని హిర మండలం దబ్బగూడ గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగులు గ్రామంలోని ఓ ప్రార్థనా మందిరాన్ని ధ్వంసం చేశాయి. ఇప్పటిదాకా గ్రామ పరిసరాలకే పరిమితమవుతున్న ఏనుగులు నేడు ఏకంగా గ్రామంలోకే ప్రవేశించాయి. గ్రామంలో ఏనుగుల బీభత్సం నేపథ్యంలో తీవ్ర భయాందోళనలకు గురైన గిరిజనులు పరుగులు పెట్టారు.