: ఢిల్లీలో గెలిచిన బీజేపీ ముగ్గురు అభ్యర్థులు వీరే
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం నమోదు చేసుకున్న సంగతి విదితమే. అయితే ఆ పార్టీ నుంచి కేవలం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ సునామీ ధాటిని తట్టుకుని గెలుపొందారు. వారిలో ఒకరు జగదీష్ ప్రదాన్ (ముస్తఫాబాద్ నియోజకవర్గం), విజేందర్ కుమార్ (రోహిణి నియోజకవర్గం), ఓం ప్రకాష్ శర్మ (విశ్వాస్ నగర్ నియోజకవర్గం)లు విజయం సాధించారు. వారిలో ప్రదాన్ కాంగ్రెస్ అభ్యర్థిని 6,031 ఓట్లతో ఓడించగా... కుమార్, శర్మలు ఆప్ అభ్యర్థులను ఓడించారు. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ మూడింటిలో రోహిణి, విశ్వాస్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేయగా, ఆ రెండు స్థానాల్లో గెలుపొందడం కొంతవరకు ఉపశమనమే.