: మోదీ పాలనకు తీర్పే ఢిల్లీ ఫలితాలు: నితీష్ కుమార్
ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు ప్రజాతీర్పే ఢిల్లీ ఫలితాలని జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు. బీహార్ రాజధాని పాట్నాలో ఆయన మాట్లాడుతూ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రజలు ఇలాంటి తీర్పే ఇస్తారని భావిస్తున్నానని తెలిపారు. ఢిల్లీ దేశానికి గుండెలాంటిదని పేర్కొన్న ఆయన, అక్కడి ప్రజల తీర్పు దేశ ప్రజలందరి తీర్పుగా భావించాలని సూచించారు. ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు బీజేపీ పాలనపై ప్రజాభిప్రాయ సేకరణలాంటివని ఆయన పేర్కొన్నారు.