: దేశానికి ఇప్పటికీ లౌకికవాదం ముఖ్యమని ఆప్ విజయం సూచిస్తోంది: కనిమొళి


ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం, బీజేపీ మట్టికరవడంపై డీఎంకే నేత, ఎంపీ కనిమొళి స్పందించారు. దేశానికి లౌకికవాదం ఇప్పటికీ చాలా అవసరమని ఈ ఫలితాలు సూచిస్తున్నాయని పేర్కొన్నారు. "ఈ స్థాయిలో అనూహ్య ఫలితాలు వస్తాయనుకోలేదు. ఇంతటి మార్జిన్, విజయం ఎన్నికలను స్వీప్ చేసేశాయి. దీని గురించి ఆలోచించాలి. ప్రధానమైన విషయం ఏమిటంటే లౌకికవాదం చాలా ప్రధానమని దేశం ఆలోచిస్తోంది" అని కనిమొళి చెప్పుకొచ్చారు. అయితే, ఈ ఎన్నిక పలితాలు నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీకి రెఫరెండమా? అని అడిగితే... అంత తొందరగా మాట్లాడటం సరికాదన్నారు.

  • Loading...

More Telugu News