: గెలిచేందుకు డబ్బు, మద్యం అవసరం లేదు: 'ఆప్' ఏపీ కన్వీనర్ రామకృష్ణరాజు
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంపై ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగం కన్వీనర్ రామకృష్ణ రాజు మీడియాతో మాట్లాడారు. ప్రజలతో కలిసి పనిచేసే ఏ పార్టీకైనా భవిష్యత్ ఉంటుందని, ఎన్నికల్లో అలాంటి పార్టీ గెలిచేందుకు డబ్బు, మద్యం అవసరం లేదని పేర్కొన్నారు. ఏడాదిగా 'ఆప్' ఢిల్లీ ప్రజలతో కలిసి సమస్యలపై పోరాడిందని, ఆ విషయాన్ని ప్రజలు గుర్తించారని రాజు వివరించారు. తాజా విజయం దేశ రాజకీయాలకు టర్నింగ్ పాయింట్ వంటిదని అభివర్ణించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ 'ఆప్' బలపడేందుకు పాటుపడతామని చెప్పారు.