: ఢిల్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు?


ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మొత్తం 70 సీట్లకు గాను 67 సీట్లను కైవసం చేసుకుని, రెండేళ్ల పసికూన ఆమ్ ఆద్మీ పార్టీ రికార్డులకెక్కింది. మోదీ హవాతో గట్టెక్కుదామనుకున్న బీజేపీ కేవలం 3 సీట్లను మాత్రమే గెలుచుకోగా, ఘనత వహించిన కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క స్థానంలో కూడా గెలవలేక, ఉన్న పరువును సైతం పోగొట్టుకుంది. ఇక ఓట్ల వాటా విషయానికి వస్తే... ఆప్ 54.1%, బీజేపీ 32.5%, కాంగ్రెస్ 9.3% ఓట్లను గెలుచుకోగా, ఇతరులు 4.1% ఓట్లను గెలుచుకున్నారు. బీజేపీ కంటే ఆమ్ ఆద్మీ పార్టీ 21.6 శాతం ఓట్లను అధికంగా గెలుచుకుంది.

  • Loading...

More Telugu News