: ఢిల్లీలో ముగిసిన ఓట్ల లెక్కింపు... 67 స్థానాల్లో ఆప్ చారిత్రక విజయం
దేశ రాజధాని ఢిల్లీలో ఓట్ల లెక్కింపు ముగిసింది. 70 అసెంబ్లీ స్థానాలకు ఫలితాలు వెల్లడయ్యాయి. 67 స్థానాలు గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. బీజేపీ 3 స్థానాలు దక్కించుకుంటే, కాంగ్రెస్ పార్టీ ఖాతానే తెరవలేదు. ఈ ఫలితాలతో ఢిల్లీలో ఆప్ అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా నిలిచింది. అరవై ఏడు అసెంబ్లీ స్థానాలు గెలుపొంది ఢిల్లీ ఎన్నికల్లో స్వీప్ చేసింది. 2013 ఎన్నికల్లో 28 స్థానాలు గెలుచుకున్న ఆమ్ ఆద్మీ... ఇప్పుడు ఒంటిచేత్తో కాంగ్రెస్, బీజేపీలను ఊడ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 14న ఢిల్లీలోని రామ్ లీలామైదానంలో కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.