: ఛాతీ ఆసుపత్రి తరలింపుపై హెచ్చార్సీని ఆశ్రయించిన టీడీపీ నేతలు
ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిని వికారాబాద్ తరలించాలని, సచివాలయాన్ని ఎర్రగడ్డలో నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్ణయించడంపై టీడీపీ మండిపడుతోంది. ఛాతీ ఆసుపత్రి తరలింపు నిర్ణయం సరికాదని భావిస్తూ టీడీపీ నేతలు మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని హెచ్చార్సీని కోరారు. ప్రభుత్వ ఉత్తర్వులు రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎర్రగడ్డలో సచివాలయాన్ని భారీ స్థాయిలో నిర్మించాలని తెలంగాణ సర్కారు భావిస్తున్న సంగతి తెలిసిందే.