: బాలీవుడ్ లో మరో జంట వివాహం
బాలీవుడ్ లో మరో లవ్ జంట పెళ్లి బాజా మోగింది. నటుడు కునాల్ కపూర్, నైనా బచ్చన్ లు రహస్యంగా సీషెల్స్ లో వివాహం చేసుకున్నారు. కేవలం కుటుంబసభ్యులు, బంధుమిత్రుల మధ్యే ఈ పెళ్లి జరిగింది. నటుడు అమితాబ్ బచ్చన్ సోదరుడు అజితాబ్, రమోలా బచ్చన్ ల కూతురే వధువు నైనా. ఏడాది ముందు వారిద్దరూ నిశ్చితార్ధం చేసుకున్నారు. పెళ్లికి సంబంధించిన వేదిక ఫోటోను ట్విట్టర్ లో పెట్టిన కునాల్ తనకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. కునాల్'రంగ్ దే బసంతి' వంటి చిత్రాల్లో నటించాడు.