: ఇసుక దందాలపై ఎందుకు నోరు మెదపడం లేదు... కోదండరామ్ పై టీడీపీ ఫైర్
తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ పై టీటీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి మండిపడ్డారు. తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేసిన కోదండరామ్... ఇప్పుడు దానిపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. మిషన్ కాకతీయకు సహకరిస్తామంటున్న కోదండరామ్... టీఎస్ మంత్రులు చేస్తున్న ఇసుక దందాలపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఒకప్పుడు సీమాంధ్ర పెట్టుబడిదారులను తిట్టిన కేసీఆర్... ఇప్పుడు సీమాంద్ర పెట్టుబడిదారులను హెలికాప్టర్లలో ఎక్కించుకుని తిరుగుతున్నారని... దీనిపై కోదండరామ్ ఏమి మాట్లాడతారని అన్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, విద్యార్థులపై లాఠీ ఛార్జీలు జరుగుతున్నా ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.