: ‘బూటకపు ఎన్ కౌంటర్’ పోలీసు బాసు చేతిలో గుజరాత్ శాంతి భద్రతలు!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇష్రత్ జహాన్, మరో ముగ్గురి బూటకపు ఎన్ కౌంటర్ కేసులో పీకల్లోతు ఆరోపణల్లో కూరుకుపోయిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీపీ పాండేకు గుజరాత్ సర్కారు కీలక బాధ్యతలు అప్పగించింది. బూటకపు ఎన్ కౌంటర్ కేసులో ఆరోపణల నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనకు ఈ నెల 5న కోర్టులో బెయిల్ మంజూరైంది. కోర్టు బెయిల్ మంజూరు నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం ఆయనపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసింది. అంతేకాక కీలకమైన లా అండ్ ఆర్డర్ విభాగం డీజీపీగా ఆయనను నియమిస్తూ నిన్న ఆనంది బెన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.