: శర్మిష్ఠ ముఖర్జీ ఓటమి... చీపురు గాలికి కొట్టుకుపోయిన రాష్ట్రపతి తనయ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ పార్టీ పరాభవం నుంచి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయ శర్మిష్ఠ ముఖర్జీ కూడా తప్పించుకోలేకపోయారు. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న గ్రేటర్ కైలాష్ నుంచి ఎన్నికల బరిలోకి డిగిన శర్మిష్ఠ, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సౌరభ్ భరద్వాజ్ చేతిలో పరాజయం పాలయ్యారు. శర్మిష్ఠ పై 4,821 ఓట్ల మెజారిటీతో భరద్వాజ్ విజయం సాధించారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేసిన భరద్వాజ్, గత ఎన్నికల్లోనూ ఆప్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గ్రేటర్ కైలాష్ నుంచి శర్మిష్ఠ విజయం తథ్యమన్న కాంగ్రెస్ వర్గాల అంచనాలను తలకిందులు చేస్తూ నియోజకవర్గ ప్రజలు భరద్వాజ్ అభ్యర్థిత్వానికి ఓటేశారు.