: మీ ఏడుపులు మమ్మల్ని ప్రభావితం చేయలేవు: నిందితులపై సుప్రీం చీఫ్ జస్టిస్ ఆగ్రహం


‘‘సొంతగా కేసులను వాదించుకునేటప్పుడు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. మీ ఏడుపులు మమ్మల్నేమీ ప్రభావితం చేయలేవు’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు అన్నారు. కేసులను స్వయంగా వాదించుకునే వ్యక్తులు కొన్ని సందర్భాల్లో భావోద్వేగాలకు గురవుతూ కోర్టు బోనులోనే బోరున విలపిస్తున్న సందర్భాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్కే సిక్రీతో కలిసి జస్టిస్ దత్తు నిన్న ఈ మేరకు వ్యాఖ్యానించారు. కోర్టులో కేసుల వాదన సందర్భంగా నిందితులు భావోద్వేగాలకు లోనుకావడం ఇకపై తగదని కూడా సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది.

  • Loading...

More Telugu News