: కేజ్రీ! నీ పోరాటాన్ని మాత్రం ఆపకు... గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయకు: అన్నా హజారే
ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రభంజనం సృష్టిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రముఖ సామాజిక కార్యకర్త, గాంధేయవాది అన్నా హజారే శుభాకాంక్షలు తెలిపారు. ఘన విజయాన్ని సాధించిన కేజ్రీవాల్ కు అభినందనలు తెలిపారు. ఆయన స్వస్థలం రాలేగావ్ సిద్ధి (మహారాష్ట్ర)లో మీడియాతో మాట్లాడుతూ, కేజ్రీవాల్ తన ఆయుధమైన ఆందోళన (పోరాటం)ను ఆపరాదని సూచించారు. అవినితికి వ్యతిరేకంగా సాగించిన పోరాటంతో ప్రజాభిమానాన్ని కేజ్రీవాల్ సంపాదించుకున్నారని... ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని తెలిపారు. ఇదే సమయంలో, గతంలో చేసిన పొరపాట్లను మళ్లీ చేయరాదని కూడా కేజ్రీకి సూచించారు. ఇదే సమయంలో మోదీ ప్రభుత్వ తీరుపై అన్నా మండిపడ్డారు. రైతుల భూములను అధికారులు లాగేసుకునే అధికారాన్ని సరళీకృతం చేశారని ఆరోపించారు.