: ఉప్పల్ స్టేడియం ముంగిట కాంగ్రెస్ కార్యకర్తల హల్ చల్
కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు నేడు ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఎదుట ఆందోళనకు దిగారు. వారి ఆగ్రహానికి కారణం ఏంటంటే, ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా వారికి ఉచిత పాస్ లు కేటాయించలేదట. ఇంకేముంది, అధికార పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. కాగా, నేడు ఉప్పల్ మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ జట్టు తాజా ఐపీఎల్ సీజన్ లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండడంతో అభిమానులు ఆ జట్టు ఆడే మ్యాచ్ లకు ఎగబడుతున్నారు.