: కాంగ్రెస్ కు సున్నం వేశారు!


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్యుడి సత్తా ముందు ప్రధాన పార్టీలు వెనకబడిపోయాయి. మొత్తం 70 నియోజకవర్గాలకు ఓట్ల లెక్కింపు జరుగుతుండగా... ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే 2 స్థానాలు గెలుచుకుని, మరో 58 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ కేవలం 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ కు మాత్రం ఢిల్లీ ఓటరు కటువైన తీర్పునిచ్చినట్టు అర్థమవుతోంది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, కాంగ్రెస్ కనీసం ఒక్క స్థానంలోనూ ఆధిక్యంలో కనిపించడం లేదు. దీంతో, కాంగ్రెస్ కు భారీ భంగపాటు ఖాయమనిపిస్తోంది.

  • Loading...

More Telugu News