: ఆప్ ఆధిక్యం ముందు ఎగ్జిట్ పోల్స్ బలాదూర్... సింగిల్ డిజిట్ కు పడిపోయిన బీజేపీ


అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఓట్ల లెక్కింపులో దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్ అంచనాలను మించిన ఆధిక్యంతో దూసుకుపోతున్న ఆ పార్టీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడం ఖాయమేనని అర్థమవుతోంది. ఆప్ ప్రభంజనానికి బీజేపీ సింగిల్ డిజిట్ స్థానాల్లో ఆధిక్యానికి పరిమితం కాగా, కాంగ్రెస్ కు రిక్తహస్తం మిగిలే ప్రమాదం లేకపోలేదు! నేటి ఉదయం 10 గంటల సమయానికి 60 స్థానాల్లో ఆప్ ఆధిక్యం కొనసాగుతుండగా, బీజేపీ కేవలం 9 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క స్థానంలోనూ ముందంజలో లేదు. ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక స్థానంలో ఆధిక్యతలో కొనసాగుతున్నారు.

  • Loading...

More Telugu News