: స్పష్టమైన ఆధిక్యం దిశగా కేజ్రీవాల్... ఆప్ కార్యాలయాల్లో సంబరాల జోరు


ఢిల్లీ అసెంబ్లీ ఓట్ల లెక్కింపులో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా సాగుతోంది. కౌంటింగ్ ప్రారంభమైన గంటన్నర వ్యవధిలోనే ఆ పార్టీ 52 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యం సాధించింది. ఇక ఆప్ కు ప్రధాన ప్రత్యర్థిగా బరిలోకి దిగిన బీజేపీ కేవలం 14 స్థానాల్లోనే ఆధిక్యం నమోదు చేసింది. ఇక ఓటముల పరంపరతో సతమతమవుతున్న కాంగ్రెస్ కేవలం రెండు చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది. పార్టీ అభ్యర్థులు ఆధిక్యం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆప్ కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. పార్టీ ఢిల్లీ కార్యాలయంతో పాటు హైదరాబాదు, ఇతర రాష్ట్రాల్లోని కార్యాలయాల్లో కార్యకర్తల సందడి జోరందుకుంది.

  • Loading...

More Telugu News