: నల్లధనంపై కొత్త నివేదిక కలకలం... లక్ష మంది నల్లకుబేరుల్లో మరో 1,195 మంది భారతీయులు


స్విస్ బ్యాంకులో మూలుగుతున్న నల్లధనంపై నిన్న విడుదలైన ఓ నివేదిక కలకలం రేపింది. ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆప్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) విడుదల చేసిన ఈ జాబితాలో నల్లధనాన్ని దాచుకున్న వారు లక్ష మందిపైనే ఉన్నారని బాంబు పేలింది. ఇందుకు సంబంధించి ఆ సంస్థ విడుదల చేసిన లక్ష మంది జాబితాలో 1,195 మంది భారతీయులున్నారన్న అంశం దేశంలో ప్రకంపనలు సృష్టించింది. ఐసీఐజే విడుదల చేసిన జాబితాలో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఖాతాల సంఖ్య పరంగా(1,668 ఖాతాలు) 18వ స్థానంలో నిలిచిన భారత్, నల్లధనం విలువ పరంగా(రూ.25,420 కోట్లు) 16వ స్థానంలో నిలిచింది. ఇప్పటికే కేంద్రం చర్యలతో బెంబేలెత్తిపోతున్న దేశీయ పారిశ్రామిక దిగ్గజాలు ఐసీఐజే నివేదికతో మరింత ఆందోళనకు గురయ్యారు.

  • Loading...

More Telugu News