: అఫ్జల్ గురు ఉరిని తప్పుగా, ఘోరంగా నిర్వహించారు: శశిథరూర్
పార్లమెంటుపై దాడికి పాల్పడిన తీవ్రవాది మహ్మద్ అఫ్జల్ గురు ఉరిపై కాంగ్రెస్ నేత శశిథరూర్ తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అతని ఉరిని చాలా తప్పుగా, ఘోరంగా నిర్వహించారని తాను భావిస్తున్నానని అన్నారు. అతడి కుటుంబానికి ఓ హెచ్చరిక చేసి, అఫ్జల్ తో చివరిసారి కలిసేందుకు అవకాశం ఇచ్చి ఉండాల్సిందని, అతని మృతదేహాన్ని వారికి అప్పగించాల్సిందని థరూర్ ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఢిల్లీలోని తీహార్ జైల్లో ఫిబ్రవరి 9,2013న యూపీఏ ప్రభుత్వం అఫ్జల్ ను ఉరి తీయించిన సంగతి తెలిసిందే.