: విందు అనంతరం వెంకయ్యను కీర్తించిన కేసీఆర్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయిన కేసీఆర్ మధ్యాహ్నం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఇచ్చిన విందులో పాల్గొన్నారు. తనయుడు కేటీఆర్ తో కలిసి వెంకయ్య నివాసానికి వెళ్లిన ఆయన విందు అనంతరం పలు అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, వెంకయ్యను ఆకాశానికెత్తేశారు. వెంకయ్య కేంద్రమంత్రిగా ఉండడం తెలుగు రాష్ట్రాల అదృష్టమని కొనియాడారు. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో సహకరించాలని కోరితే, వెంటనే సానుకూల స్పందన వ్యక్తం చేశారని తెలిపారు. అటు, వెంకయ్య కూడా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తనను మర్యాదపూర్వకంగానే కలిశారని వివరించారు. హైదరాబాద్ డెవలప్ మెంట్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని, తెలంగాణలో అమలవుతున్న పథకాలు తమ మధ్య చర్చకు వచ్చాయని చెప్పారు.

  • Loading...

More Telugu News