: తుపాకీల మోతతో దద్దరిల్లిన ఫ్రాన్స్
ఫ్రాన్స్ మరోసారి తుపాకీ మోతలతో దద్దరిల్లింది. దేశంలోని కీలక నగరాల్లో ఒకటైన మార్సెలీలో ముసుగులు ధరించిన దుండగులు కాల్పులు జరిపారు. ఆ దేశ ప్రధాని మరికాసేపట్లో మార్సెలీకి రానున్న సమయంలో ఈ కాల్పులు జరగడం గమనార్హం. కలష్నికోవ్ తుపాకులతో వీరు పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన దుండగుల కోసం ఫ్రాన్స్ పోలీసులు, కమెండోలు వేట ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.