: తెలంగాణకు ఏ సమస్య వచ్చినా స్పందిస్తాం: వెంకయ్యనాయుడు


తెలంగాణ రాష్ట్రానికి చెందిన అనేక అంశాలపై తాను, టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ మధ్యాహ్నం కేసీఆర్ కు ఢిల్లీలోని తన నివాసంలో వెంకయ్యనాయుడు విందు ఇచ్చారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ, తమ భేటీ మర్యాద పూర్వకంగా జరిగిందని చెప్పారు. రవాణా, తాగునీరు తదితర అంశాలపై మాట్లాడుకున్నామని అన్నారు. హైదరాబాదు నగరంపై కేసీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చారని తెలిపారు. తెలంగాణకు ఎలాంటి సమస్య వచ్చినా స్పందిస్తామని వెంకయ్య తెలిపారు.

  • Loading...

More Telugu News