: మేం డిన్నరు చేశాం అంతే...గొడవ చేయలేదు: రామ్ చరణ్
విందు వివాదంపై సినీ హీరో రామ్ చరణ్ స్పందించారు. అల్లరి చేశానని, వివాదానికి కేంద్రబిందువునయ్యానని వచ్చిన వార్తలు అవాస్తవమని ఆయన ఫేస్ బుక్ లో పేర్కొన్నారు. తన ఇంట్లో ఫ్యామిలీ డిన్నర్ చేశామని రామ్ చరణ్ తెలిపారు. తాను ఇరుగుపొరుగు వారిని గౌరవిస్తానని, వారి ఏకాగ్రతకు భంగం కలిగించేలా ప్రవర్తించనని రామ్ చరణ్ అన్నారు. కాగా, ఎమ్మెల్యే తీగల కుమారుడు శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీ లగడపాటి కుమారుడు, మరో ఇద్దరితో కలిసి డిన్నర్ చేసిన రామ్ చరణ్ విందు చేసి, అరుపులు కేకలతో ఇబ్బంది పెట్టినట్టు, ఆయన పక్కింటిలో నివాసముంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతం సవాంగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.