: బాలయ్య ఇలాకాలో పురందేశ్వరి
టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో ఆయన సోదరి, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి సందడి చేశారు. హిందూపురంలో ఈ రోజు జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమానికి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.