: అశోకా ప్రెసిడెన్సియల్ సూట్ లో కేసీఆర్... ఢిల్లీలో కేసీఆర్ బసకు రోజుకు రూ.1.5 లక్షలు!


ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ ఒక్కరోజు బస కోసం ఏకంగా రూ.1.5 లక్షలు ఖర్చవుతున్నాయట. ఎందుకంటే, ఆయన బస చేస్తోంది, సాదాసీదా హోటల్ కాదు మరి. ఢిల్లీ నగరంలోనే అత్యంత విలాసవంతమైన అశోకా హోటల్ లో ఆయన దిగారు. హోటల్ లోని ప్రెసిడెన్సియల్ సూట్ లో కేసీఆర్ బస చేస్తున్నారు. సాధారణంగా విదేశాల అధ్యక్షులు, ప్రధానులకే ప్రెసిడెన్సియల్ సూట్ ను బుక్ చేస్తారు. అలాంటిది ఓ రాష్ట్ర సీఎం హోదాలో ఢిల్లీ వెళ్లిన ఆయన సదరు ఖరీదైన సూట్ లో బస చేస్తున్నారని ఓ వర్గానికి చెందిన మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ నెల 5న ఢిల్లీ చేరుకున్న ఆయన ఐదు రోజుల పాటు అదే సూట్ లో బస చేస్తున్నారట. హోటల్ అద్దె రూ.1.5 లక్షలు కాగా, భోజనం తదితరాలకు బిల్లు అదనం.

  • Loading...

More Telugu News