: కార్ దేకో.కామ్ లో రతన్ టాటా పెట్టుబడులు
ఆన్ లైన్ ఆటో క్లాసిఫైడ్ సర్వీస్ ప్రొవైడర్ కార్ దేకో.కామ్ లో టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా పెట్టుబడులు పెట్టబోతున్నారు. ఓ ఇ-కామర్స్ సంస్థలో టాటా ఛైర్మన్ పెట్టుబడి పెట్టడం ఇది నాలుగవసారి. గతేడాది మార్కెట్ లో అతిపెద్ద సంస్థ స్నాప్ డీల్, ఫర్నీచర్ ఇ-టెయిలర్ అర్బన్ లాడర్, ఆన్ లైన్ జ్యువెలరీ అమ్మకందారు బ్లూస్టోన్ లో టాటా పెట్టుబడులు పెట్టారు. "భారతీయ ఆటో రంగంలో టాటా బాగా గౌరవించే వ్యక్తి. మొదటిసారి వ్యక్తిగత హోదాలో పెట్టుబడి పెడుతూ ఒక ఆటో పోర్టల్ తో చేతులు కలిపారు. ఆయన పెడుతున్న మొత్తాన్ని బయటికి వెల్లడించడంలేదు. అవసరమైనప్పుడు కంపెనీకి సలహాదారుగా ఉండేందుకు కూడా ఆయన అంగీకరించారు" అని కార్ దేకో.కామ్ ఓ ప్రకటనలో తెలిపింది.