: ఢిల్లీలో నేడు రెండు చోట్ల రీపోలింగ్
ఢిల్లీలోని రెండు కేంద్రాల్లో ఈరోజు రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. తూర్పుఢిల్లీలోని రోహ్ తాస్ నగర్ లోని బూత్ నంబరు 132, డీఐడీ లైన్స్ ఏరియాలోని బూత్ నంబరు 31 కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు శనివారం జరిగాయి. అయితే, పైన పేర్కొన్న ప్రాంతాల్లో ఈవీఎంలు పని చేయకపోవడంతో పోలింగ్ జరగలేదు. ఈ క్రమంలో ఈ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా రీపోలింగ్ జరుగుతుంది. రేపు ఢిల్లీలో ఓట్ల లెక్కింపు జరగనున్న సంగతి తెలిసిందే.