: కవలల్ని కన్న 'పురుష' స్త్రీ... వైద్య చరిత్రలో అద్భుతం!


వైద్య శాస్త్రంలో అత్యంత అరుదుగా సంభవించే సంఘటనకు మీరట్ లోని ఒక ఆసుపత్రి సాక్ష్యంగా నిలిచింది. పుట్టుకతో ఆడపిల్ల అయినా, జన్యుపరంగా పురుష లక్షణాలతో పెరిగిన యువతి కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ తరహా కేసుల్లో 10 లక్షల మందిలో ఒకరికి మాత్రమే తల్లి అయ్యే అవకాశం ఉంటుంది. ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ సునీల్ జిందాల్ వెల్లడించిన వివరాల ప్రకారం, పైకి చూడటానికి పూర్తి మహిళలా కనిపించే మాయ (పేరు మార్చడం జరిగింది) అంతర్గతంగా మాత్రం పురుష జన్యువులను కలిగి ఉంది. ఆమెలో పునరుత్పత్తి అండాలు తయారు కావు. తన జీవితంలో ఒక్కసారి కూడా నెలసరి కాలేదు. జననాంగాలు బిడ్డకు జన్మను ఇచ్చేలా లేవు. కానీ ఆమె ఆడ మనసు బిడ్డ కావాలని కోరుకుంది. పొత్తి కడుపులో ఎక్కడో సాధారణ పరిమాణంతో పోలిస్తే, చిన్నగా ఉన్న గర్భాశయాన్ని గుర్తించిన డాక్టర్లు మూడేళ్ళపాటు కృషి చేసి దాన్ని బిడ్డను మోయగల స్థితికి తీసుకొచ్చారు. ఆ తరువాత ల్యాబ్ లో ఫలదీకరించిన అండాన్ని ప్రవేశపెట్టారు. అండం ఎదుగుదలను నిత్యమూ పరిశీలిస్తూ, అతి జాగ్రత్తగా కాపాడి డెలివరీ చేశారు. "ఈ ఘటన పురుషుడు కవల బిడ్డల్ని కనడంతో సమానం" అని డాక్టర్ సునీల్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News