: ప్రతిపక్షాల కట్టడికి సోనియా వ్యూహం!
వచ్చే సోమవారం నుంచి రెండవదశ పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తన నివాసంలో పార్టీ సీనియర్ నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. రక్షణ మంత్రి ఏకే ఆంటోని, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్, హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్, గ్రామీణభివృద్ధి శాఖ మంత్రి జైరామ్ రమేష్ ఈ భేటీలో పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రతి పక్షాలను ఎలా ఎదుర్కొవాలనే అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. 2జీ స్పెక్ట్రమ్, కోల్ స్కామ్ తాజా నివేదికలు దుమారం రేపుతుండడంతో సమావేశాల్లో వారు లేవనెత్తే ప్రశ్నలకు, డిమాండులకు దీటుగా సమాధానాలు ఇవ్వాలని నేతలకు అధినేత్రి సూచించినట్లు తెలుస్తోంది.