: సునంద పుష్కర్ పై రాం గోపాల్ వర్మ సినిమా!


సంచనాలకు మారుపేరైన ప్రముఖ చలనచిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సంచలనం రేపనున్నారు. దేశవ్యాప్తంగానే కాక అంతర్జాతీయంగానూ ప్రకంపనలు సృష్టించిన సునంద పుష్కర్ హత్యోదంతంపై ఆయన ఓ సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్యగా విశేష ప్రచారం పొందిన ఆమె అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఈ ఉదంతానికి గల కారణాలు నేటికీ వెల్లడి కాలేదు. ఢిల్లీ పోలీసులు జుట్టు పీక్కుంటున్నా, ఏ చిన్న ఆధారం కూడా లభించలేదు. శశి థరూర్ తో పాటు సునంద (తొలి భర్త) కొడుకును కూడా విచారించినా ఫలితం లభించలేదు. అయితే, వర్మ తన సినిమా ద్వారా కేసు క్లోజ్ చేస్తారనుకుంటున్నారా? అలాంటిదేమీ లేదులెండి. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న వర్మ, ఈసారి మాత్రం మరోమారు ఇబ్బందులు కొనితెచ్చుకోదలచుకోవడం లేదట. ఎందుకంటే, ఈ కేసును పోలీసులు ఛేదించిన తర్వాతే ఆయన చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళతారట.

  • Loading...

More Telugu News