: కుమార్తెకు పర్షియన్ భాషలో పేరు పెట్టిన ధోనీ
భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన కుమార్తెకు కాస్త వెరైటీగా ఉండే పేరును ఖరారు చేశాడు. గడచిన శుక్రవారం గుర్గావ్‌లోని ఆసుపత్రిలో ధోనీ సతీమణి సాక్షికి పాప జన్మించిన సంగతి తెలిసిందే. తమ చిట్టితల్లికి మిస్టర్ కూల్ దంపతులు ‘జిబా’ అనే పేరును నిర్ణయించారు. పర్షియన్ భాషలో జిబా అంటే ‘అందం’ అని అర్థమట. కాగా, తొలిసారిగా తండ్రయిన ధోనీకి భారత టీమ్ మేనేజిమెంట్ శనివారం రాత్రి గ్రాండ్ పార్టీ ఇచ్చినట్టు తెలిసింది. ఈ సందర్భంగా జట్టు సహచరులకు తన కుమార్తె పేరును ధోనీ వెల్లడించాడట.