: ఈజిప్ట్ భద్రతా దళాలతో తలపడ్డ ఫుట్ బాల్ అభిమానులు... 22 మంది మృతి
ఈజిప్ట్ లో ఒక ఫుట్ బాల్ లీగ్ మ్యాచ్ సందర్భంగా అభిమానులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణలో 22 మంది మరణించారు. తమకు ఎంతో ఇష్టమైన ఫుట్ బాల్ ఆటను తిలకించేందుకు టిక్కెట్లు లేకుండా స్టేడియం దగ్గరికి వచ్చి అత్యుత్సాహంతో లోనికి వెళ్లేందుకు వారు యత్నించడంతో ఈ ఘటన జరిగింది. కేవలం ఒక్క గేటు మాత్రమే తెరచి అయోమయానికి, తోపులాటకు పోలీసులు కారణమయ్యారని అభిమానులు ఆరోపించారు. ఘర్షణలో పదుల సంఖ్యలో పోలీసుల వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించినట్టు అధికారులు తెలిపారు. అనంతరం లీగ్ మ్యాచ్ ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.