: కేజ్రీవాల్... ఓ నక్సలైట్... గెలిచినా ఏడాదిలోగా పరార్: బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి
ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు ముగిశాయి. మరో 24 గంటలు గడిస్తే, కొత్త ముఖ్యమంత్రి ఎవరో కూడా తేలిపోనుంది. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో అప్పటిదాకా బిజీబిజీగా గడిపిన నేతలంతా రిలాక్సయ్యారు. అయితే వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్రంగా మారిన బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి మాత్రం రిలాక్సైన దాఖలా కనిపించలేదు. ఢిల్లీ ఎన్నికల్లో తమకు ముచ్చెమటలు పట్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై ఆయన విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్... ఓ నక్సలైట్ అని ఆయన వ్యాఖ్యానించారు. నక్సలైట్ స్వభావం కలిగిన కేజ్రీవాల్ ఎన్నికల్లో గెలిచినా ఏడాదిలోగా పదవి వదిలేస్తారని ఆయన జోస్యం చెప్పారు. కేజ్రీవాల్ అనుచరులంతా నక్సలైట్ ఉద్యమంతో సంబంధం ఉన్నవారు కావడంతో ప్రభుత్వాన్ని నడపలేరని స్వామి చెప్పారు.