: జూన్ 11 వరకే పెళ్లిసందడి... ఆపై ఏడాది పాటు బాజా భజంత్రీలు ఉండవట!


ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లో పెళ్లిళ్ల సందడి ఊపందుకుంది. వచ్చే సంవత్సరం వివాహం చేసుకోవాలని అనుకున్నవారు కూడా ఈ ఏడాదే పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. అది కూడా జూన్ 11లోపే ఏడడుగులు వేయాలని తొందర పడుతున్నారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో జూన్ 11 తర్వాత ఏడాది పాటు వివాహాలు చేయకూడదని పండితులు సూచిస్తున్న నేపథ్యంలో పెళ్లిళ్ల సందడి జోరందుకుంది. వివాహాది శుభకార్యాలు, ముహూర్తాల విషయంలో పండితులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాలు పూర్తయ్యాక ఆరునెలల పాటు చేయకూడదని కొందరు, ఏడాది పాటు శుభకార్యాలు నిర్వహించకూడదని మరికొందరు చెబుతున్నారు. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పటి (జులై 14 పుష్కరాల ప్రారంభం) నుంచి నదికి తూర్పుభాగంలో ఉన్నవారు ఏడాది పాటు, పశ్చిమతీరంలో ఉన్న వారు విజయదశమి వరకు (నాలుగు నెలలపాటు) వివాహాది శుభకార్యాలు చేసుకోకూడదని పండితులు సూచిస్తున్నారు. కాగా, ఈ సంవత్సరంలో ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 9 వరకు గురుమౌఢ్యం, ఆగస్టు 10 నుంచి 20వ తేదీ మధ్య శుక్రమౌఢ్యం, సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 12 వరకు శూన్యమాసం. ఆ సమయంలో సాధారణంగానే శుభకార్యాలకు ముహూర్తాలు ఉండవు. ఆ తరువాత మరో 8 నెలలు ఆగాల్సి ఉంటుందని భావిస్తున్న వేలాదిమంది యువతీ యువకులు జూన్ లోగానే వివాహాలు చేసుకోవాలని తొందర పడుతున్నారు.

  • Loading...

More Telugu News