: గెలుపుపై ధీమా... స్నేహితులతో కలిసి 'బేబీ' సినిమా చూసిన కేజ్రివాల్


ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఆమ్ ఆద్మీ పార్టీకే మెజారిటీ చూపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత కేజ్రివాల్ గెలుపుపై ధీమాతో ఉల్లాసంగా కనిపించారు. గత కొన్ని వారాలుగా ఎన్నికల ప్రచారంతో తీరిక లేకుండా గడిపిన ఆయన నిన్న స్నేహితులతో కలసి 'బేబీ' హిందీ సినిమా చూశారు. అంతకుముందు ఉదయం కాసేపు యోగా చేసి, అనంతరం వార్తాపత్రికలు చూసి, టీవీ, సామాజిక మాధ్యమాలకు కొంత సమయం కేటాయించారని తెలిసింది. మధ్యాహ్నం పార్టీ సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. పార్టీ మంచి మెజారిటీతో విజయం సాధించినా భారీగా సంబరాలు చేసుకోకూడదని కేజ్రీ ఈ సందర్భంగా చెప్పినట్లు సమాచారం. అనంతరం మనీశ్ సిసోడియా, కుమార్ విశ్వాస్, 30 మంది ఆప్ వలంటీర్లతో కలిసి కేజ్రీవాల్ కౌశాంబిలోని మల్టిప్లెక్స్‌ లో 'బేబీ' చిత్రాన్ని వీక్షించారు.

  • Loading...

More Telugu News