: డ్రైవింగ్ దూకుడుకు యాప్ తో అడ్డుకట్ట


రోడ్డు ప్రమాదంలో టీవీ9 యాంకర్ బద్రి మృతి చెందిన సంగతి తెలిసిందే. వేగంపై నియంత్రణ కోల్పోవడంతో ప్రతినిత్యం లెక్కలేనంత మంది మృతి చెందుతున్న విషయం తెలిసిందే. డ్రైవింగ్ కారణంగా జరుగుతున్న ప్రమాదాలు ఆయా కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు అమెరికాలోని న్యూయార్క్ లో గల మిన్నెసోటా యూనివర్సిటీ పరిశోధకులు టీన్ డ్రైవర్ సపోర్ట్ సిస్టమ్ (టీడీఎస్ఎస్) పేరిట ఓ స్మార్ట్ ఫోన్ యాప్ రూపొందించారు. తమ పిల్లలు రోడ్డు మీద ఏ వేగంతో డ్రైవింగ్ చేస్తున్నారు అనే విషయాలను తల్లిదండ్రులు ఈ యాప్ ద్వారా తెలుసుకునే అవకాశముందని పరిశోధకులు చెప్పారు. పిల్లలు అతివేగంతో వెళ్తుంటే తల్లిదండ్రులకు ఆ విషయం ఎస్ఎమ్ఎస్ ద్వారా తెలియజేస్తుంది. అంతటితో ఆగకుండా ఆడియో, విజువల్ హెచ్చరికలతో టీనేజర్ల దూకుడుకు ఈ యాప్ అడ్డుకట్ట వేస్తుందని వారు వివరించారు.

  • Loading...

More Telugu News