: మెరుగైన చికిత్స కోసం విజయవాడకు బద్రి కుటుంబ సభ్యుల తరలింపు... బంధువు పరిస్థితి విషమం
రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన టీవీ9 న్యూస్ రీడర్ బద్రి భార్య లక్ష్మీసుజాత, ఆయన ఇద్దరు కుమారులు, బంధువును మెరుగైన చికిత్స నిమిత్తం అధికారులు విజయవాడకు తరలించారు. నేటి ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం లక్ష్మీనగర్ వద్ద జరగిన రోడ్డు ప్రమాదంలో బద్రి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో ఆయన భార్య, ఇద్దరు కుమారులు సహా కారులోని బద్రి బంధువు తారక్ లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే వారందరినీ ఏలూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు మెరుగైన చికిత్స కోసం కొద్దిసేపటి క్రితం విజయవాడకు తరలించారు. ఇదిలా ఉంటే, బద్రి బంధువు తారక్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.