: స్వయంగా కారు నడిపిన బద్రి... ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు
అదుపు తప్పి చెట్టును ఢీకొన్న బద్రి కారు నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో ఛాతీ తీవ్ర ఒత్తిడికి గురి కావడంతో బద్రి అక్కడికక్కడే మరణించగా, బద్రి భార్య సుజాత, ఇద్దరు కుమారులు, బద్రి సమీప బంధువులకు ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు సమాచారం. నేటి ఉదయం జరిగిన ఈ ప్రమాదానికి కారు టైరు పేలిపోవడమే కారణమని తెలుస్తోంది. ప్రమాద సమయంలో కారును బద్రి స్వయంగా నడుపుతున్నారు. కారు డ్రైవర్ ఉన్నప్పటికీ బద్రి కారు నడుపుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.