: టీవీ 9 న్యూస్ రీడర్ బద్రి దుర్మరణం... ద్వారకతిరుమల సమీపంలో చెట్టును ఢీకొన్న బద్రి కారు


పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం లక్ష్మీనగర్ వద్ద కొద్దిసేపటి క్రితం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రముఖ న్యూస్ రీడర్ బద్రీ (టీవీ9) మృత్యువాతపడ్డారు. బద్రి కుటుంబం ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో బద్రి అక్కడికక్కడే మరణించగా, ఆయన భార్య, ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. ద్వారకతిరుమల నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడ్డ బద్రి భార్య, ఇద్దరు పిల్లలను స్థానికులు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News