: అభివృద్ధిలో రాయలసీమకు టాప్ ప్రయారిటీ... రెండో రాజధాని యోచన లేదన్న యనమల
నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధిలో రాయలసీమకు అత్యధిక ప్రాధాన్యమివ్వనున్నామని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. అదే సమయంలో రాయలసీమలో రెండో రాజధాని ఏర్పాటు యోచన ప్రభుత్వ పరిశీలనలో లేదని ఆయన కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలన్నీ రాజధానిలోనే ఉండాల్సి ఉందన్న ఆయన, రెండో రాజధాని గురించిన ఆలోచన చేయడం లేదన్నారు. రాయలసీమను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ఇందులో భాగంగానే రాయలసీమలోని రహదారులన్నింటినీ విస్తరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.