: సత్తా చాటిన మోహిత్ శర్మ... మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్
ఫిట్ నెస్ లేని కారణంగా జట్టు నుంచి తప్పుకున్న టీమిండియా ఫేసర్ ఇషాంత్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన మోహిత్ శర్మ వార్మప్ మ్యాచ్ లోనే సత్తా చాటాడు. వచ్చీరాగానే హిట్టింగ్ ప్రారంభించిన ఆసీస్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ను బోల్తా కొట్టించాడు. 17 బంతుల్లో 22 పరుగులు చేసిన వాట్సన్, మోహిత్ బౌలింగ్ లో అక్షర్ పటేల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వాట్సన్ ఔటవడంతో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (71)తో జత కలిసిన స్టీవెన్ స్మిత్ సింగిల్ పరుగుకే పెవిలియన్ చేరాడు. ఉమేశ్ యాదవ్ వేసిన బంతికి అతడు క్లీన్ బౌల్డయ్యాడు. 16.3 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ మూడు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది.