: వార్మప్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
వరల్డ్ కప్ సన్నాహక మ్యాచ్ లలో భాగంగా, అడిలైడ్ లో భారత్ తో జరుగుతున్న తొలి మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియాకు బౌలింగ్ అప్పగించిన ఆసీస్ తొలి బ్యాటింగ్ కే మొగ్గుచూపింది. ఫిట్ నెస్ కారణంగా వరల్డ్ కప్ టోర్నీ నుంచి తప్పుకున్న పేసర్ ఇషాంత్ శర్మ స్థానంలో కొత్త కుర్రాడు మోహిత్ శర్మ బరిలోకి దిగుతున్నాడు. మరోవైపు గాయం కారణంగా కొద్దిరోజుల పాటు జట్టుకు దూరమైన టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ తిరిగి జట్టులోకొచ్చాడు.