: బెజవాడలో బ్లేడ్ బ్యాచ్ టెర్రర్... ఒంటరిగా వెళుతున్న వారిపై దాడి, దోపిడీ!


నవ్యాంధ్ర రాజధానిగా రూపుదిద్దుకోనున్న విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ కలకలం రేపుతోంది. చేతుల్లో బ్లేడ్లతో నడిరోడ్లపైకి వస్తున్న ఈ ముఠా సభ్యులు ఒంటరిగా వెళుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని యథేచ్ఛగా దాడులకు దిగుతున్నారు. సైకోలుగా మారుతున్న వీరు, బ్లేడ్లతో జనాలపై దాడులు చేయడంతో పాటు తమను తామే సదరు బ్లేడ్లతో కోసుకుని జనాన్ని భయభ్రాంతులకు గురి చేసి దోపిడీలు కొనసాగిస్తున్నారు. గతంలో తరచూ చోటుచేసుకున్న ఈ దాడులు కొద్దికాలం కనిపించలేదు. తాజాగా మళ్లీ నగరంలో ఈ తరహా దాడులు పెరిగాయి. ఇటీవలే ఈ దాడులకు దిగుతున్న 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయినా అక్కడక్కడ ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజా దాడుల నేపథ్యంలో నగరవాసులు భయాందోళనలకు గురవుతున్నారు.

  • Loading...

More Telugu News