: వరల్డ్ కప్ నుంచి ఇషాంత్ శర్మ ఔట్


ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో జరగనున్న ప్రపంచకప్ లో ఆడే అవకాశాన్ని టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ కోల్పోయాడు. ఈ రోజు జరిగిన ఫిట్ నెస్ టెస్టులో ఇషాంత్ విఫలమయ్యాడు. ఇషాంత్ శర్మ స్థానంలో మోహిత్ శర్మను తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇషాంత్ తో పాటు ఫిట్ నెస్ పరీక్ష ఎదుర్కొన్న రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజాలు మాత్రం తమ ఫిట్ నెస్ ను నిరూపించుకున్నారు. ఈ నెల 14న వరల్డ్ కప్ ప్రారంభం కానుండగా, రేపటి నుంచి ప్రాక్టీస్ మ్యాచ్ లు షురూ కానున్నాయి.

  • Loading...

More Telugu News